రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామటూ మోసాలకు పాల్పడిన వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌కు చెందిన పింజరి ఖాజా... ఉన్నతాధికారుల పరిచయంతో ఎలాంటి పరీక్షలు లేకుండా నేరుగా ఉద్యోగం ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షలు వసూలు చేశాడు.
ఇలా 25 మంది నుంచి రూ.1.61 కోట్లు వసూలు చేశాడు. ఉద్యోగం రాకపోవడంతో బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఖాజాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతనికి సహకరించిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కిలోన్నర బంగారం స్వాధీనం