ETV Bharat / crime

బ్యూటీపార్లర్​లో భార్యను చంపి.. మెడలో పూలదండలు వేసి.. - గుంటూరు జిల్లా తాజా నేర వార్తలు

HUSBAND KILLED HIS WIFE: స్థలాన్ని అమ్మి తన అప్పులు తీర్చాలని ఓ భర్త గత కొద్దిరోజులుగా తన భార్యపై ఒత్తిడి తెస్తున్నాడు. అయితే ఆమె కాదనడంతో ఏకంగా మెడపై కత్తితో నరికాడు. అనంతరం మృతి చెందిందని నిర్ధారణకు వచ్చి.. తనతో పాటు తెచ్చుకున్న రెండు పూలదండలను భార్య మృతదేహంపై ఉంచి నేరుగా పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

HUSBAND KILLED HIS WIFE
HUSBAND KILLED HIS WIFE
author img

By

Published : Nov 17, 2022, 5:34 PM IST

HUSBAND KILLED HIS WIFE: స్థలం అమ్మి తన అప్పులు తీర్చాలని ఓ భర్త పట్టుబట్టాడు. అందుకు ఆ భార్య నిరాకరించింది. దీంతో ఏకంగా ఆమె మెడపై కత్తితో నరికాడు. అనంతరం మృతి చెందిందని నిర్ధారణకు వచ్చి.. తనతో పాటు తెచ్చుకున్న రెండు పూలదండలను భార్య మృతదేహంపై ఉంచి నేరుగా పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలోని గాంధీనగర్​లో జరిగింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. "కాకర్ల కోటేశ్వరరావు, స్వాతిలకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. స్వాతి బ్యూటీపార్లర్ నిర్వహిస్తుంది. ఈ క్రమంలో కోటేశ్వరరావుకు అప్పులు కావడంతో.. పెళ్లి సమయంలో భార్య స్వాతికి పుట్టింటి నుంచి సంక్రమించిన స్థలం అమ్మి అప్పులు తీర్చాలని పట్టుబట్టాడు. ఈ నేపథ్యంలోనే నెలరోజులు క్రితం స్వాతిని కొట్టడంతో పుట్టింటికి వెళ్లింది. తిరిగి కొన్ని రోజుల తర్వాత భర్త ఇంటికి వచ్చింది. తాజాగా మంగళవారం రాత్రి ఇరువురి మధ్య మళ్లీ వివాదం జరిగి.. స్వాతిపై దాడి చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈరోజు బ్యూటీ పార్లర్​లో స్వాతి ఒంటరిగా ఉందని తెలిసి.. రెండు పూలదండలు, కత్తి తీసుకొని అక్కడికి చేరుకున్నాడు. పథకం ప్రకారమే భార్యను కత్తితో మెడ మీద నరికాడు. ఆమె మృతి చెందిందని నిర్ధారించుకొని.. తన వెంట తెచ్చుకున్న రెండు పూలదండలను ఆమె మెడలో వేసి అక్కడనుంచి నేరుగా రూరల్ పోలీస్​స్టేషన్​లో లొంగిపోయాడు" అని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి: హైదరాబాద్‌లో నకిలీ తుపాకుల లైసెన్స్ ముఠా అరెస్టు

యువతి ముఖంపై మద్యం సీసాతో దాడి.. తనకు దక్కంది ఎవరికీ దక్కకూడదని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.