ETV Bharat / crime

Husband killed his wife: భార్యను చంపేశాడు.. సహజ మరణంగా చిత్రీకరించాడు!

మద్యం మత్తులో మనిషి మృగంగా మారడం వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎంతో మంది అనాథలవుతున్నారు. స్వల్ప మనస్పర్థలతో భార్యను హత్యచేసి సహాజ మరణంగా చిత్రీకరించేందుకు భర్త ప్రయత్నించిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

Husband  killed his  wife
Husband killed his wife
author img

By

Published : Sep 30, 2021, 7:39 PM IST

భార్యను హత్యచేసి... సహజ మరణంగా చిత్రీకరించేందుకు భర్త ప్రయత్నించిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. నాగారం మండలం పస్తాలకు చెందిన శ్రీనివాస్‌, సూరమాంబ(34) దంపతులు హైదరాబాద్‌లో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగా శ్రీనివాస్‌ మద్యం సేవించి తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు.

ఈ క్రమంలో రోజులాగే మంగళవారం రాత్రి మద్యం సేవించిన శ్రీనివాస్‌ భార్యతో గొడవపడ్డాడు. బుధవారం తెల్లవారు జామున సుమారు 2 గంటల సమయంలో దంపతులిద్దరూ తమ టాటా ఏసీ వాహనంలో కూరగాయలు కొనేందుకు వెళ్లారు. మార్గమధ్యలో ఇద్దరికి గొడవ జరగడంతో సూరమాంబ తన కూతురుకు ఫోన్​చేసి మీనాన్న నన్ను చంపేట్లు ఉండని తెలిపింది. ఆ తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఉదయం 6గంటలకు తండ్రి శ్రీనివాస్ కూతురుకు ఫోన్​చేసి మీ అమ్మ బీపీ తగ్గి చనిపోయిందంటూ చెప్పాడు.

మృతదేహాన్ని సొంతూరు పస్తాలకు తీసుకెళుతున్నాను... మీరు మీ మామతో గ్రామానికి వచ్చేయమని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అనుమానం వచ్చిన కుటుంబీకులు శ్రీనివాస్‌ను నిలదీయడంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకుని పోలీసు స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. బాధితురాలు తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు శవాన్ని తుంగతుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ హరికృష్ణ తెలిపారు

ఇదీ చదవండి: MAN MISSING: ఆఫీసుకని వెళ్లాడు.. అప్పటి నుంచి నా భర్త కనిపించడం లేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.