ETV Bharat / crime

భార్యపై అనుమానంతో కత్తితో పొడిచాడు - Siddipet District Latest News

భార్యపై అనుమానం పెంచుకొని కత్తితో దాడి చేశాడో భర్త. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Husband attacked wife with knife on suspicion
భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడి
author img

By

Published : Mar 7, 2021, 10:19 PM IST

వివాహేతర సంబంధం అనుమానంతో ఓ భర్త.. భార్యను కత్తితో కడుపులో పొడిచిన దారుణ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మహిళను చికిత్స కోసం హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రికి తరలించారు.

సిద్దిపేటకు చెందిన రాజు, చిన్నకోడూర్​లోని లలిత నాలుగు ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల నుంచి ఆమె ప్రవర్తనలో మార్పు రావటంతో భర్తకు అనుమానం కలిగింది. ఈరోజు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. రాజు కత్తితో లలిత కడుపులో పొడిచాడు.

ఆమెను స్థానికులు హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందిని డాక్టర్లు చెప్పటంతో హైదరాబాద్​కు తరలించారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వీరికి 3 ఏళ్ల పాప ఉంది.

ఇదీ చూడండి: భీంగల్ మార్కెట్​లో వ్యాన్ బీభత్సం... ఇద్దరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.