ETV Bharat / crime

భార్య సహజీవనం.. భర్త దాడిలో ఒకరు మృతి! - సహజీవనం చేస్తున్న జంటపై దాడి

భార్య వేరొకరితో సహజీవనం చేస్తుండటాన్ని భర్త సహించలేకపోయాడు. ఈ తరుణంలో ఇద్దరిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

husband attack, ap crime news
భార్య సహజీవనం.. భర్త దాడిలో ఒకరు మృతి!
author img

By

Published : Jun 19, 2021, 11:38 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న జంటపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో బజారి అనే వ్యక్తి మృతి చెందగా.. ఉరుకుందమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

తన భార్య మరొకరితో సహజీవనం చేస్తోందన్న కోపంతోనే భర్తే ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వేరొకరితో సహజీవనం కారణంగానే గతంలో వీరు విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: మూసి ఉన్న రైస్​మిల్​కు రూ.90 కోట్ల కరెంట్ బిల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.