నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో దొంగలు హల్చల్ చేశారు. ఆదివారం రాత్రి ప్రధాన కూడలిలో ఉన్న మూడు షాపుల్లోని పైకప్పు రేకులను కట్చేసి లోనికి వెళ్లిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుకాణాల్లోని సెల్ఫోన్లు, డబ్బులు సహా పలు విలువైన వస్తువులు దొంగిలించారు.
మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల తలుపులు పగులగొట్టడానికి దొంగలు విఫలయత్నం చేశారు. నవీపేట్లో దొంగలు తరచూ ఆలయాలు, వ్యాపార సముదాయాలలో చోరీలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు వాపోయారు. ఈ దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్సై యాకూబ్ త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: వాగులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం