Vishakhapatnam Theft Case: ఏపీలోని విశాఖ జనతా కాలనీలోని ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ ఘటనలో 70 తులాల బంగారం, 8 కిలోల వెండి, రూ.15 లక్షల నగదు చోరీకి గురైనట్లు (Janata Colony Theft) బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
జనతా కాలనీకి చెందిన పసుమర్తి వైకుంఠరావు గోపాలపట్నంలో పూజా సామగ్రి దుకాణం నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయాన్నే కుమార్తెను పాఠశాలలో వదిలిపెట్టి భార్యతో కలిసి దుకాణానికి వెళ్లారు. సాయంత్రం గ్యాస్ డెలివరీ కోసం వచ్చిన వ్యక్తి.. ఇంటి తలుపు తెరిచి ఉండటంతో అనుమానించి వైకుంఠరావుకు సమాచారం ఇచ్చాడు.
ఇంటికి వచ్చిన వైకుంఠరావు దొంగతనం జరిగిందని గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారమే బ్యాంకు నుంచి నగలు, నగదు తీసుకొచ్చినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రైమ్ డీసీపీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కొందరు వ్యక్తులు ఇంటి పరిసరాల్లో కారులో తిరిగారనే వివరాల ఆధారంగా.. దొంగల కోసం గాలింపు(Inquiry about Theft incident) చేపట్టారు.
ఇవీచదవండి: Online lottery cheating: రూ. 2.5 కోట్ల లాటరీ పేరుతో లూటీ.. 13 లక్షలు దోపిడీ
America Accident: పక్షం రోజుల్లో ఇంటికి రావాల్సిన విద్యార్థులు అమెరికా రోడ్డు ప్రమాదంలో..
Shilpa Chowdary Case Update: కోట్లు తీసుకుని బెదిరింపులు.. శిల్పాచౌదరిపై మరో కేసు నమోదు