New year drunk and drive cases : హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో శుక్రవారం ఒక్కరోజే 3,146 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అధికంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,528 కేసులు, హైదరాబాద్‌లో 1,258, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 360 కేసులు నమోదయ్యాయి. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్ల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించారు. శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహించి... మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలగానే వెంటనే వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.
పక్కా తనిఖీలు..
మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు 265 బృందాలుగా ఏర్పడ్డారు. పలుచోట్ల తనిఖీలు నిర్వహించి, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చౌబౌలి, కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్ పీఎస్‌ల పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆయా పోలీస్ స్టేషన్లలో పనిచేసి బదిలీపై వెళ్లిన సీఐలను సైతం తనిఖీల కోసం పిలిపించారు.
ప్రమాదాలు తక్కువే..
మూడు కమిషనరేట్ల పరిధిలో గతేడాదితో పోలిస్తే... పోలీసులు ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో ప్రమాదాలను తగ్గించగలిగారు. పటాన్చెరు పీఎస్ పరిధిలో జరిగిన వేర్వేరు రహదారి ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వనస్థలిపురంలో ప్రహరి గోడను కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు స్వల్పంగా గాయపడ్డారు. రెండు, మూడు ఘటనలు మినహా వేడుకలు ప్రశాతంగానే ముగిశాయి.
తెగ తాగేశారు..
telangana Liquor Sales in 2021 : తెలంగాణ రాష్ట్రంలో 2021లో మద్యం అమ్మకాల జోరు పరంపర కొనసాగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి 2021 సంవత్సరం విక్రయాలు అత్యధికమని చెప్పొచ్చు. 2021లో అంతకు ముందు ఏడాది కంటే దాదాపు రూ.కోట్లకుపైగా అధికంగా మద్యం అమ్మకాలు జరగడం సరికొత్త రికార్డు. రాష్ట్రం ఏర్పాటైన తరువాత 2016లో రూ.14,075 కోట్ల విలువైన 2.72 కోట్ల కేసుల లిక్కర్, 3.42 కోట్ల కేసుల బీరు అమ్ముడు పోయింది. 2020 సంవత్సరంలో తీసుకుంటే రూ.25,601.39 కోట్ల విలువైన 3.18 కోట్ల కేసులు లిక్కర్, 2.93 కోట్ల కేసుల బీరు విక్రయాలు జరిగాయి. అదే 2021 సంవత్సరంలో తీసుకుంటే 30,222 కోట్ల విలువైన 3.69 కోట్ల కేసుల లిక్కర్, 3.26కోట్ల కేసుల బీరు విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే గత సంవత్సరం కంటే 4,621 కోట్లు విలువైన మద్యం ఎక్కువ అమ్ముడు పోయింది.
రికార్డు స్థాయిలో సేల్స్
Liquor Sales in December 2021: కరోనా ప్రభావం దాదాపు అన్ని వ్యవస్థల మీద పడినా అబ్కారీ శాఖ మీద మాత్రం పడలేదు. 2021 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన మద్యం విక్రయాలను పరిశీలిస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.7673 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా నల్గొండ జిల్లాలో రూ. 3289 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. హైదరాబాద్‌లో రూ. 3208 కోట్లు, ఆదిలాబాద్, నిజామాబాద్‌లు మినహా అన్ని జిల్లాల్లో రెండువేల కోట్లకు తక్కువ కాకుండా రెండున్నర వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోయినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: vemula prashanth interview : ప్రభుత్వానికి రైతులు, పేదలు రెండు కళ్లు: వేముల