భవన నిర్మాణ యజమానుల నిర్లక్ష్యంతో భాగవతమ్మ చెరువులో చేపలు మృతి చెందాయని గంగపుత్రులు ఆరోపించారు. చెరువులోకి భారీస్థాయిలో మురుగునీరు చేరి మృత్యువాత పడ్డాయని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నానక్రామ్గూడలోని భాగవతమ్మ చెరువులో కాలుషిత నీరు చేరడంతో పెద్దఎత్తున చేపలు మృత్యువాత పడ్డాయి. గురువారం మత్స్యకారులు చేపలు పట్టేందుకు వెళ్లగా చనిపోయిన చేపలు కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు.
భాగవతమ్మ చెరువు దాదాపు యాభై ఎకరాలు విస్తీర్ణంలో ఉండేదని గంగపుత్రులు తెలిపారు. చుట్టుపక్కల మణికొండ, ఖాజాగూడ, పుప్పాలగూడ గంగపుత్రులు చెరువుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని వెల్లడించారు. చెరువు చుట్టు భారీ నిర్మాణాలు చేపట్టడంతో వాటి ద్వారా వచ్చే మురుగు నీరు చెరువులో కలవకుండా ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కొత్తగా చేపడుతున్న నిర్మాణాలతో వ్యర్థాలు నేరుగా చెరువులోకి చేరడంతో చేపలు మృత్యువాత పడ్డాయని గంగపుత్రులు తెలిపారు.
ఇదీ చూడండి: