ETV Bharat / crime

మరో మహిళతో దొరికిపోయిన హోంగార్డు - వైరల్ వార్తలు

వివాహేతర సంబంధం కొనసాగిస్తోన్న ఓ హోంగార్డును.. అతని తల్లిదండ్రులు రెడ్​ హ్యండెడ్​గా పట్టుకున్నారు. సదరు మహిళపై దాడి చేసి బంధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన గొడవకు సంబంధించిన వీడియో.. సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తోంది.

homeguard illegal affair
వివాహేతర సంబంధం
author img

By

Published : Apr 6, 2021, 1:14 PM IST

Updated : Apr 6, 2021, 2:31 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పనిచేస్తున్న హోంగార్డు నరేశ్​కు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. నరేశ్​కు వివాహం జరిగి ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలం నుంచి మరో మహిళతో.. అతను​ చనువుగా ఉంటున్నాడని తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. రెండు రోజులుగా... నరేశ్​ ఇంటికి రాకపోవటం వల్ల వారి అనుమానం బలపడింది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు... కూమారుడు​ ఉన్న ఇంటి వద్దకు వెళ్లారు.

ఇంట్లో ఉన్న మహిళను ఆరా తీశారు. తన కుమారుని దగ్గర డబ్బులు తీసుకుంటోందని... ఇంటికి రాకుండా చూస్తోందని మహిళపై దాడి చేశారు. దుర్బాషలాడుతూ... మహిళ చేతిలోని బ్యాగు లాక్కునే ప్రయత్నం చేశారు. అనంతరం మహిళ చేతులను కట్టేసి నానా రభస చేశారు.

మరో మహిళతో దొరికిపోయిన హోంగార్డు

తన వద్ద నుంచే నరేశ్​... పలువురికి అప్పులు ఇప్పించాడని సదరు మహిళా ఆరోపించింది. వాటిని అడిగినందుకు హోంగార్డు తల్లిదండ్రులు ఒంటరిగా ఉన్న తనపై దాడి చేసి బంధించారని వాపోయింది. ఈ తతంగాన్నంత కొందరు వీడియో తీయగా... ఇప్పుడు ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

తమ కుమారుడు తప్పు చేస్తున్నాడని భావించిన హోంగార్డు తల్లిదండ్రులు... నరేశ్​ను ఏమీ అనకపోగా సదరు మహిళపై మాత్రం దాడి చేయటం గమనార్హం. ఈ విషయం బయటికి పొక్కటం వల్ల రాజీ యత్నాలు కొనసాగుతున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: ట్రాక్టర్ డ్రైవర్ హత్య.. వివాహేతర సంబంధమేనా!

Last Updated : Apr 6, 2021, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.