ETV Bharat / crime

బాలికపై హోంగార్డు అత్యాచారం - హైదరాబాద్​ తాజా వార్తలు

ప్రజలకు రక్షణగా నివాల్సినే పోలీసే రాక్షసుడిగా మారాడు. బాలికపై ఓ హోం గార్డు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన సికింద్రాబాద్​లోని అడ్డగుట్టలో జరిగింది.

home gaurd arrest in secendrabad
బాలికపై హోంగార్డు అత్యాచారం
author img

By

Published : Feb 21, 2021, 3:41 PM IST

ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన హోంగార్డుపై సికింద్రాబాద్​ తుకారాంగేట్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అడ్డగుట్టలో నివాసముండే హోంగార్డు బి. మల్లికార్జున(40).. హైదరాబాద్ సీసీఎస్​లో డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. ఆయనకు పరిచయమైన బాలిక(16)ను కొద్ది రోజుల కిందట అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరికి చెప్పొద్దని ఆమెను భయపెట్టాడు.

బాలికకు రెండు రోజుల కిందట ఆరోగ్యం సరిగా లేకపోవటంతో తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం తెలిసింది. ఈనెల 18న వారు ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హోంగార్డును ఈనెల 19న అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించాడని గోపాలపురం ఏసీపీ వెంకటరమణ తెలిపారు. అదే రోజు రాత్రి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించామన్నారు.

ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో డెంటల్ విద్యార్థిని మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.