హెరిటేజ్ పరువు నష్టం(Heritage defamation case) కేసులో ఏపీ మంత్రి కన్నబాబు(Minister kannababu), వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు(mla ambati rambabau)పై నాన్ బెయిలబుల్ వారెంట్(NBW) అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని హైదరాబాదులోని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. కన్నబాబు, అంబటి రాంబాబు తప్పుడు ఆరోపణలు చేసి పరువు నష్టం కలిగించారంటూ హెరిటేజ్ సంస్థ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై ప్రజాప్రతినిధుల కోర్టులో కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో కన్నబాబు, అంబటి రాంబాబుపై గతంలో న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇవాళ మరోసారి కేసు విచారణ జరిగింది.
అంబటి రాంబాబుతో పాటు ఫిర్యాదు చేసిన హెరిటేజ్ ప్రతినిధి సాంబమూర్తి కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో కన్నబాబు, అంబటి రాంబాబుపై ఎన్బీడబ్ల్యూ అమలుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్న కోర్టు.. హెరిటేజ్ ప్రతినిధి సాంబమూర్తి కూడా తదుపరి విచారణకు కచ్చితంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. అనంతరం కేసు విచారణను అక్టోబర్ 7కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: Bhupalpally news: కేసీఆర్ మోసం చేశారు.. కానీ ప్రజలు మాత్రం నావైపే ఉన్నారు: గండ్ర