ETV Bharat / crime

మద్నూర్ మండలంలో గుట్కా ప్యాకెట్లు పట్టివేత - kamareddy police seized gutka

లాక్​డౌన్​ను ఆసరా చేసుకుని ఎవరి కంటపడకుండా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం వద్ద పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

kamareddy, gutka packets seized, gutka packets
కామారెడ్డి, గుట్కా ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లు సీజ్
author img

By

Published : May 13, 2021, 7:12 AM IST

లాక్​డౌన్ సమయంలో ఎవరూ చూడరనుకుని వాహనంలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న గుట్కాలను అధికారులు పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సరిహద్దు వద్ద లాక్​డౌన్ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి ఓ వాహనం సరిహద్దు వరకు వచ్చింది. వాహనంలో ఎరువుల బస్తాలు ఉన్నాయి.

అనుమానం వచ్చిన పోలీసులు వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేయగా.. ఎరువుల బస్తాల కింద రూ.22వేల విలువగల గుట్కా సంచులు ఉన్నట్లు గుర్తించారు. వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.