ETV Bharat / crime

గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు దొంగలు మహారాష్ట్ర జైలుకు తరలింపు - gunjapadugu sbi bank robbery thefts news

పెద్దపల్లి జిల్లా గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు చోరీ కేసులో నలుగురు నిందితులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని మహారాష్ట్రలోని ఓ జైలుకు తరలించారు. మార్చి 24 న ఆ బ్యాంకులో జరిగిన చోరీలో సుమారు 6 కేజీల బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు.

gunjapadugu sbi bank robbery
గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు దొంగతనం కేసు
author img

By

Published : May 20, 2021, 2:01 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు దొంగతనం కేసులో నలుగురు నిందితులను మంథని కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. అనంతరం వీరిని మహారాష్ట్రలోని చంద్రాపుర్ జైలుకు తరలించారు. మిగిలిన ముగ్గురు దొంగలను త్వరలోనే పట్టుకుంటామని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు.

ఈ ఏడాది మార్చి 21న రాత్రి కొంతమంది దుండగులు బ్యాంకు వెనుక భాగం నుంచి కిటికీ గ్రిల్స్​ను తొలగించి, గ్యాస్ సిలిండర్, కట్టర్ సహాయంతో సేఫ్టీ లాకర్​ను కట్ చేశారు. సుమారు 6 కిలోల బంగారం, రూ. 18 లక్షల నగదు దొంగిలించారు. ఎట్టకేలకు నలుగురు దొంగలు పట్టుబడగా వారి వద్ద నుంచి మహారాష్ట్ర పోలీసులు 2.9 కిలోల బంగారాన్ని రికవరీ చేసుకున్నారు. ఆ రికవరీలో 70 శాతం బంగారం గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు లోనిదే.

కొన్ని రోజుల క్రితం రామగుండం పోలీసులు ఉత్తరప్రదేశ్​కు చెందిన ఒక నిందితుడు ఆదేశ్ శర్మను పట్టుకొని.. అతని దగ్గరినుంచి చోరి సొత్తు సుమారు 20 తులాల బంగారం రికవరీ చేశారు. నిందితుడిని జుడీషియల్​ రిమాండ్​కు తరలించారు. కేసులో ఇంకా విచారణ కొనసాగుతోందని.. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను పంపించినట్లు.. వారి వద్ద నుంచి మిగిలిన బంగారం, నగదు రాబడతామని సీపీ సత్యనారాయణ తెలిపారు.

ఇదీ చదవండి: రూ.42 లక్షలు విలువైన నిషేధిత పత్తి విత్తనాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.