సెల్‌ఫోన్ స్నాచింగ్ కేసులో ఇద్దరు యువకులతో పాటు మైనర్‌ను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌కు చెందిన భూక్యా సుమన్(22), భువనగిరి వాసి శివకిషోర్(28), వికారాబాద్‌లో నివసించే బాలుడు(17) ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఫుట్‌పాత్‌పై నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఒంటరిగా వెళ్తుండటం చూసి
డీమార్ట్‌లో పనిచేస్తున్న యువతి ఈ నెల 15న రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఒలిఫెంటా బ్రిడ్జి ప్రాంతం నుంచి నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో ఈ ముగ్గురు నిందితులు ఆమె చేతిలో ఉన్న చరవాణిని లాక్కుని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్ స్టేషన్ ప్రాంతంలో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి సుమన్, శివకిషోర్‌ను రిమాండ్‌కు, బాలుడిని జువైనల్ హోంకు తరలించారు.
ఇదీ చదవండి: జక్లేర్‌లో నిషేధిత గుట్కా పట్టివేత!