ETV Bharat / crime

యూట్యూబ్ చూసి చోరీలు.. 3గంటల్లో ఛేదించిన పోలీసులు - ఛేదించారు

ఇంజినీరింగ్ చదివాడు. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. జల్సాల కోసం.. యూట్యూబ్​లో చూసి దొంగతనాలు చేయడం నేర్చుకున్నాడు. ఒంటరి మహిళలున్న ఇళ్లే లక్ష్యంగా చోరీకి పాల్పడ్డాడు. అంతా అయిపోయిందనుకున్నాడు. రోజు గడవక ముందే.. సీసీ కెమెరాల ద్వారా పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది.

Gold theft case cracked within 3 hours in vanasthalipuram
బంగారం చోరీ కేసు.. 3గంటల్లోనే ఛేదించారు
author img

By

Published : Feb 7, 2021, 5:37 PM IST

హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన ఓ చోరీకి సంబంధించిన కేసును.. పోలీసులు మూడు గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్ట్​ చేసి 2.7తులాల బంగారు ఆభరణం, ఓ సెల్​ఫోన్​, కత్తిని స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలిస్తున్నట్లు ఏసీపీ పురుషోత్తం తెలిపారు.

పోలీసులు కథనం ప్రకారం

ఇంజినీరింగ్ చదివి.. చెడు వ్యసనాలకు బానిసైన నవీన్(30) దొంగతనాలు ఎలా చేయాలో యూట్యూబ్​లో చూసి నేర్చుకున్నాడు. అద్దె ఇల్లు కోసమంటూ.. ఒంటరి మహిళలున్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకున్నాడు. అదే విధంగా స్థానిక గౌతమినగర్​లోని ఓ ఇంటికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న మహిళపై కత్తితో దాడి చేశాడు. బాధితురాలి ఒంటిపైనున్న మంగళ సూత్రాన్ని దొంగిలించి పరారయ్యాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా మూడు గంటల్లో నిందితుడిని పట్టుకున్నారు. బంగారు గొలుసును కొనుగోలు చేసిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ పురుషోత్తం తెలిపారు.

ఇదీ చదవండి: పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.