ETV Bharat / crime

ప్రాణాలు కాపాడతారని ఆసుపత్రికి తీసుకెళ్తే... బంగారు నగలు మాయం చేశారు.. - భువనగిరి జిల్లా కేంద్రాసుపత్రిలో నగలు మాయం

ప్రభుత్వాసుపత్రి సిబ్బంది మానవత్వానికి మాయని మచ్చ తెచ్చారు. ఓ మహిళకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. ఈ క్రమంలో మృతదేహాన్ని అప్పగించే సమయంలో బంగారు ఆభరణాలు లేవని కుటుంబీకులు గమనించి ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

bhuvanagiri govt hospital
భువనగిరి జిల్లా కేంద్రాసుపత్రి
author img

By

Published : Apr 26, 2022, 5:14 PM IST

భువనగిరి జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స కోసం తరలించిన మహిళ మెడలో బంగారు గొలుసు, చెవి కమ్మలు మాయమైన సంఘటన జరిగింది. ఇదేంటని మృతురాలి బంధువులు ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. ఆసుపత్రిలో అలాంటిదేమి జరగలేదని బుకాయించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని అర్బన్‌ కాలనీకి చెందిన లలిత అనే మహిళకు గుండెపోటు రావడంతో హుటాహుటిన జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. అనంతరం మృతదేహాన్ని అప్పగించే సమయంలో మహిళపై బంగారు ఆభరణాలు లేవని కుటుంబసభ్యులు గమనించి ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు.

bhuvanagiri govt hospital
ఆవేదన వ్యక్తం చేస్తున్న మృతురాలి బంధువులు

'ఆసుపత్రికి వచ్చే సమయంలో ఆమె మెడలో రెండు పుస్తెలు,రెండుగుండ్లు ఉన్నాయి. కంపెనీ నుంచే కొంచెం అస్వస్థతగా ఉందంటే నేరుగా ఆసుపత్రికి వచ్చాం. రాగానే లోపలికి తీసుకెళ్లి నీ వెంట ఎవరైనా వారసులు వచ్చారా అని అడిగారు. ఎవరు రాలేదని చెప్పా... నీ బిడ్డను కొద్దిసేపట్లో గాంధీకి తీసుకెళ్లకపోతే ప్రమాదం ఉంది అన్నారు. ఆమెకు చిన్న పిల్లగాడు ఉన్నాడు. మృతదేహన్ని అప్పగించే ముందు చూస్తే మెడలో ఉన్న అభరణాలు లేవు. అడిగితే అలాంటివి ఏమిలేవు అని దబాయించారు.'-మృతురాలి బంధువు

ఈ ఘటనపై బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఎన్ని ఘటనలు జరుగుతున్న అధికారులకు మాత్రం చలనం రావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది, వైద్యులపై ఫిర్యాదులు రావటంతో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ సందర్శించి వారిని పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించి వెళ్లారు. కాగా 22 తేదీన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి, రోగులకు మెరుగైన వైద్యం చేయాలని సూచించారు. అయినా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి:నేను డాక్టర్‌ని.. నన్నే ఆపుతారా.. మీ సంగతి చెప్తా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.