ETV Bharat / crime

పాత నేరస్థుల ఇళ్లపై పోలీసుల దాడులు.. మారణాయుధాలు స్వాధీనం

అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్న నలుగురు పాత నేరస్థులను హైదరాబాద్ గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుని ఆర్మ్స్​ యాక్ట్​ కింద కేసు నమోదు చేశారు.

illegal weapons in convicts homes
పాత నేరస్థుల ఇళ్లలో మారణాయుధాలు
author img

By

Published : Mar 4, 2021, 8:40 PM IST

పాత నేరస్థుల వద్ద అక్రమంగా మారణాయుధాలు ఉన్నాయనే సమాచారంతో గోల్కొండ పోలీసులు వారి ఇళ్లపై దాడులు నిర్వహించారు. సోదాల్లో లభించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఏ1 మహమ్మద్ అలీ ఖాన్, ఏ2 ఇబ్రహీం అలీ ఖాన్, ఏ3 జుబేర అలీ ఖాన్​ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తల్వార్, 3 సుత్తెలు, 2 కత్తులు, బేస్​బాల్ బ్యాట్​ను స్వాధీనం చేసుకున్నారు. ఏ4 అక్రమ్ అలీ ఖాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

వీరు గతంలో లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ డబుల్ మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరిపై గోల్కొండ, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. ఆర్మ్స్​యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: రెండు వేర్వేరు చోరీ కేసుల్లో నలుగురు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.