ETV Bharat / crime

ప్రియుడిపై బ్లేడుతో దాడి చేసిన ప్రియురాలు.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు.. - ప్రియురాలి దాష్టికం

Girlfriend attacks boyfriend with blade: ప్రేమ పేరుతో అమ్మాయిల వెంట పడుతుంటారు కొందరు అబ్బాయిలు. ఒప్పుకుంటే సరే. మరి ఒప్పుకోకపోతే మాత్రం కథ వేరే ఉంటది. ప్రేమిస్తావా..? లేదా..? అంటూ వేధింపులు ప్రారంభమవుతాయి. కొందరు ఇంకో అడుగు ముందుకేసి.. దాడులకు తెగబడుతుంటారు కూడా. ఇవన్నీ మనం తరచూ వినే వార్తలే. కానీ... తాజాగా ఓ ప్రియురాలే ప్రియుడిపై దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్​లోని కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

attack
attack
author img

By

Published : Dec 8, 2022, 4:03 PM IST

Girlfriend attacks boyfriend with blade: ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకో అని అడిగిన ప్రియుడిపై బ్లేడుతో ప్రియురాలు దాడి చేసిన ఘటన భాగ్యనగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల కిందట చోటుచేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువతి, ఓ యువకుడు.. ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా నగరానికి వచ్చారు. ఓ టీ స్టాల్‌ వద్ద పరిచయం ఏర్పడింది. రోజూ అక్కడే కలుసుకునేవాళ్లు. ఆ కలయిక చివరికి హింసకి దారితీసింది. యువతి పథకం ప్రకారం యువకుడి గొంతు కోసే క్రమంలో చెంప కింద తీవ్ర గాయమైంది.

ప్రేమగా నటించి పీక కోసిన ప్రియురాలు.. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన లక్ష్మీ సౌమ్య(23) బీబీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం కేపీహెచ్‌బీకి వచ్చి నాలుగో రోడ్డులోని ఓ ప్రైవేటు వసతిగృహంలో చేరింది. ఇక్కడికి సమీపంలోనే గుంటూరుకు చెందిన అశోక్‌కుమార్‌ మరో ప్రైవేటు వసతిగృహంలో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. వీరిద్దరికి అదే రోడ్డులోని ఓ టీ స్టాల్‌ వద్ద పరిచయం ఏర్పడింది. అలా 6 నెలల పరిచయంతో అశోక్‌ పెళ్లి చేసుకుంటానని సౌమ్యతో ప్రస్తావించాడు. ఆమె మనసులో ఏముందో తెలియదు గానీ అశోక్‌తో ప్రేమగా ఉంటున్నట్లు నటించేది.

వసతిగృహంలో గొడవలు పెట్టుకోవడంతో నిర్వాహకులు ఆమెను ఖాళీ చేయించారు. తొమ్మిదోఫేజ్‌లోని మరో హాస్టల్‌కు మారింది. అశోక్‌ ఆమె ఖర్చులు భరిస్తూ తరచూ పెళ్లి ప్రతిపాదనలు తెస్తునాడు. ఈనెల 5న అశోక్‌ పుట్టినరోజు కావడంతో ఇద్దరూ రాత్రి 7 గంటల ప్రాంతంలో టీ స్టాల్‌ వద్ద కలిశారు. పెళ్లి ప్రస్తావన తేవడంతో మాటమాట పెరిగింది. అప్పటికే బ్లేడు(మినీ కట్టర్‌)తో వచ్చిన సౌమ్య అశోక్‌ గొంతుపై దాడి చేయబోయింది. తప్పించుకోవడంతో మెడపై, చెంప కింద లోతుగా కోసుకుపోయింది. వెంటనే అతన్ని అదే రోడ్డులోని ఓ ఆసుపత్రికి తరలించగా, 50 కుట్లు పడ్డాయి. యువకుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.