మేడ్చల్ జిల్లా కాప్రా జీహెచ్ఎంసీ డీఈ మహాలక్ష్మీ 20 వేలు లంచం తీసుకుని అవినీతి నిరోధక శాఖ అధికారుల(ACB)కు చిక్కారు. ఇటీవల జీహెచ్ఎంసీ మహిళా స్వీపర్ అనారోగ్యంతో మృతి చెందగా... భార్య ఉద్యోగం భర్తకు ఇచ్చేందుకు డీఈ మహాలక్ష్మీ లంచం అడిగారు.
డీఈ అవినీతి వ్యవహారంపై స్వీపర్ కుమారుడు శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్ హాల్ దగ్గర డీఈ అసిస్టెంట్ అయిన విజయ్ 20 వేలు లంచం తీసుకుంటుండగా... అనిశా అధికారులు పట్టుకున్నారు.
ప్రస్తుతం డీఈ మహాలక్ష్మి కార్యాలయంతోపాటు నాగారం చక్రిపురి కాలనీలోని ఆమె నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. డీఈ మహాలక్ష్మి నివాసంలో బంగారం, నగదు గుర్తించినట్లు అనిశా అధికారులు తెలిపారు. సోదాలు పూర్తయిన తర్వాత మహాలక్ష్మిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు.
ఇదీ చదవండి: చీట్ చేసిన వైన్స్ ఓనర్.. దుకాణాదారులు పోలీసులకు ఫిర్యాదు