ETV Bharat / crime

'యువతిపై లైంగిక దాడి.. తెలిసిన వారే గాయత్రికి సహకరించారు' - gayatri and five accused were arrested in harassment on woman case

Gang Rape attempt on Woman: కొండాపూర్‌లో యువతిపై అత్యాచారయత్నం కేసులో గచ్చిబౌలి పోలీసులు.. గాయత్రి సహా ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తెలిసిన వాళ్లే గాయత్రికి సహకరించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. గాయత్రి వద్ద డ్రైవర్లుగా పనిచేసే విష్ణువర్థన్, మనోజ్‌, ఆమె ఇంట్లో అద్దెకు ఉండే మస్తాన్‌, మరో ఇద్దరు కలిసి సహకరించినట్లు గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ సురేశ్ చెప్పారు. గాయత్రి భర్త శ్రీకాంత్ పాత్రపై ఆరా తీస్తున్నారు.

Gang Rape attempt on Woman
యువతిపై లైంగిక దాడి
author img

By

Published : May 30, 2022, 5:28 PM IST

Gang Rape attempt on Woman: హైదరాబాద్ కొండాపూర్​లో యువతిపై అత్యాచారయత్నం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితురాలు గాయత్రి భర్త పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. తెలిసిన వారి ద్వారానే యువతిపై సామూహిక దాడి చేయించినట్లు విచారణలో వెల్లడైంది. కేసు వివరాలను గచ్చిబౌలి ఇన్​స్పెక్టర్ సురేశ్ 'ఈటీవీ భారత్'​కు వెల్లడించారు.

'సంతానం కలగడం లేదని కొన్నాళ్లుగా చికిత్స తీసుకుంటున్న గాయత్రి.. కారులో ఆస్పత్రికి వెళ్లేందుకు తరచూ డ్రైవర్లను బుక్‌ చేసుకునేది. తన భర్తతో సదరు యువతి సన్నిహితంగా ఉంటోందని అనుమానం పెంచుకున్న గాయత్రి.. ఈ క్రమంలో తనకు పరిచయమైన ఇద్దరు డ్రైవర్లకు కుట్ర ప్రణాళిక వివరించింది. డ్రైవర్లు విష్ణువర్ధన్, మనోజ్‌తోపాటు స్నేహితుడికి విషయం చెప్పింది. అదే విధంగా తన ఇంట్లో అద్దెకు ఉంటున్న మస్తాన్​తో పాటు, తన స్నేహితుడు ముజాహిద్దీన్‌ను కుట్ర విషయం వివరించింది. పథకం ప్రకారం ఆ ఐదుగురినీ గాయత్రి ముందుగానే ఇంట్లో ఉంచింది. బాధితురాలి తల్లిదండ్రులను బయటే ఉంచి ఆమెను లోపలికి తీసుకెళ్లింది. యువతి లోపలికి వచ్చిన వెంటనే.. నలుగురు ఆమె కాళ్లు, చేతులూ కట్టేయగా.. బాధితురాలిని వివస్త్రను చేసి మరో వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. మరో వైపు గాయత్రి బాధితురాలిని దూషిస్తూ ఆమెపై దాడి చేసి వీడియో చిత్రీకరించింది. ఎవరికైనా చెబితే సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించింది. ఘటన సమయంలో ఇంట్లో శ్రీకాంత్ లేడు.' -సురేశ్​, గచ్చిబౌలి ఇన్​స్పెక్టర్

పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసిన పలు కీలక విషయాలు

ఇవీ చదవండి: యువతిపై నలుగురితో లైంగికదాడి చేయించి.. ఘాతుకాన్ని వీడియో తీసింది..!

కేఆర్‌ఎంబీ జలాశయాల కమిటీ భేటీ.. హాజరుకాని తెలంగాణ అధికారులు

యాంకర్స్​ ఓవర్​యాక్షన్​.. లైవ్‌లోనే ఏడ్చేసిన కృతిశెట్టి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.