ETV Bharat / crime

గ్రానైట్ పరిశ్రమలో గ్యాస్​ లీక్​.. నలుగురికి గాయాలు - yadadri bhuvanagiri district latest news

గ్యాస్​ లీకై అగ్నిప్రమాదం సంభవించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్​లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పింది.

Gas leak in granite industry at yadadri district Injuries to 4 workers
గ్రానైట్ పరిశ్రమలో గ్యాస్​ లీక్​.. 4గురు కార్మికులకు గాయాలు
author img

By

Published : Mar 16, 2021, 4:27 AM IST

గ్యాస్ లీకై నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ పారిశ్రామికవాడలోని ఎస్​వీజీ గ్రానైట్ పరిశ్రమలో జరిగింది. అందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఎస్​వీజీ గ్రానైట్ పరిశ్రమలోని ఒక కార్మికుడు వెల్డింగ్ చేసేందుకు గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి మర్చిపోయాడు. కాసేపటికి మరో కార్మికుడు సిలిండర్​ని వెలిగించటానికి ప్రయత్నించగా... వెంటనే మంటలు వ్యాపించాయి. అక్కడే పనిచేస్తున్న కార్మికులు మీసాల పాండరి, నరసింహ, రవి, ధరమ్ సింగ్​లు తీవ్రంగా గాయపడ్డారు.

పారిశ్రామికవాడలోని తోటి కార్మికులు చికిత్స నిమిత్తం వారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఉప్పల్​లోని ఓ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పాండరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన బీబీ నగర్ ఎస్​ఐ రాఘవేందర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: మోసాలకు పాల్పడుతోన్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్: సీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.