ETV Bharat / crime

Ganjai Smuggling: పక్కా ప్రణాళికతో... గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

బతుకుదెరువు కోసం బిహార్​ నుంచి హైదరాబాద్​ వచ్చిన వ్యక్తి అధిక డబ్బు కోసం గంజాయి అమ్మడం (Ganjai Smuggling) ప్రారంభించాడు. నిఘా పెట్టిన పోలీసులు.. పథకం ప్రకారం వ్యక్తిని అరెస్ట్ చేసి... అతని నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Ganjai Smuggling
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
author img

By

Published : Sep 22, 2021, 11:12 AM IST

జల్సాలకు అలవాటు పడి హైదరాబాద్‌ శివారులో గంజాయి విక్రయాలు (Ganjai Smuggling) జరుపుతున్న ఓ లారీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బిహార్‌కు చెందిన సంతోష్‌రాయ్‌... బతుకుదెరువు కోసం వలసవచ్చి, కుటుంబంతో కలిసి అబ్దుల్లాపూర్‌మెట్‌లో నివాసముంటున్నాడు. తుర్కయంజాల్‌లో లారీడ్రైవర్‌గా పనిచేసే వాడు.

అక్కడ పనిచేసే క్రమంలో ఓ టీకొట్టు వద్ద గుర్తు తెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడింది. సులువుగా డబ్బులు సంపాదించవచ్చనే దురుద్దేశంతో సంతోష్ రాయ్​... ఆ వ్యక్తి నుంచి తక్కువ ధరకు గంజాయి కొనేవాడు. అనంతరం యువతను లక్ష్యంగా చేసుకుని విక్రయాలు (Ganjai Smuggling) జరిపేవాడు. ఇటీవల జరిగిన సైదాబాద్​ ఘటన తర్వాత పోలీసులు... గంజాయి అమ్మేవారిపై, సేవించే వారిపై నిఘా పెట్టారు.

ఆ క్రమంలో సంతోష్‌పై కూడా పోలీసులు దృష్టి పెట్టి గంజాయి అమ్ముతుండగా అరెస్ట్ చేశారు. ఒక్కొక్క ప్యాకెట్ రూ. 150కు విక్ర‌యించేందుకు సిద్ధంగా ఉన్న 75 ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు త‌ర‌లించారు. గంజాయి ఎక్కడి నుంచి తరలిస్తున్నారనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చూడండి: హైదరాబాద్​లో యథేచ్ఛగా మాదకద్రవ్యాల విక్రయం.. నేరాలకు అదే కారణం!

హైదరాబాద్​లో స్త్రీలను భయపెడుతున్న 'సింగరేణి’ కాలనీలెన్నో'...

గంజాయి రూపు మార్చుకుంది.. యువత భవిష్యత్తు అంధకారం అవుతోంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.