ETV Bharat / crime

గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ యువకులు - గంజాయి వార్తలు

జల్సాలకు అలవాటుపడిన నలుగురు యువకులు గంజాయి వ్యాపారం చేస్తూ పట్టుబడిన ఘటన సూర్యాపేట జిల్లా మోతే మండలం అప్పన్నగూడెంలో చోటు చేసుకుంది. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి నుంచి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ యువకులు
గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ యువకులు
author img

By

Published : Jun 11, 2021, 11:02 AM IST

సులువుగా డబ్బు సంపాదనకు అలవాటుపడిన సూర్యాపేట పట్టణానికి చెందిన నవీన్, వంశీ అనే ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై ఏపీలోని అరకు ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి సూర్యాపేట జిల్లాలో విక్రయిస్తున్నారు. పట్టణంలో పోలీసుల నిఘా ఉంటుందని అప్పన్నగూడెంలోని నవీన్ బంధువుల ఇంట్లో నిల్వ ఉంచి విక్రయిస్తున్నారు.

తమ వద్ద గంజాయి ఉన్న విషయాన్ని స్నేహితులకు సమాచారం ఇచ్చి అప్పనగూడెనికి రావాల్సిందిగా కోరగా, స్నేహితులు లక్ష్మణ్, అరుణ్, అఖిల్ అప్పనగూడెనికి వచ్చి గంజాయి కొనుగోలు చేస్తుండగా గ్రామస్థులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. వీరి నుంచి కిలో గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, రెండు చరవాణుల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వంశీ మిగిలిన గంజాయితో పరారీలో ఉండగా మిగిలిన నలుగురిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: స్టార్​ హోటల్​లో లగ్జరీ కారును కొట్టేశాడు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.