ATM Thieves Arrested: హర్యానాకు చెందిన దొంగల ముఠా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నగరంలోని బాలాజీ నగర్లో ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు. రాత్రి సమయంలో ఐదుగురు దుండగులు కంటైనర్లో సిటీలోకి వచ్చి బాలాజీ నగర్ వద్ద జాతీయ రహదారిలో వాహనాన్ని నిలిపారు. సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలోకి ఒక దొంగ చొరబడి రంపంతో ఏటీఎం కోసే యత్నం చేస్తుండగా.. మిగిలిన వారు బయట ఉన్నారు.
అప్పుడే గస్తీ కోసం అటువైపునకు వచ్చిన పోలీసులు.. ఏటీఎం బయట ఉన్న వ్యక్తిని చూసి అనుమానంతో వారి వద్దకు వెళ్లారు. దుండగులు అప్రమత్తమై మార్గాల్లో తప్పించుకొని పారిపోయారు. ముగ్గురు కంటైనర్లోకి ఎక్కి ఉడాయించగా పోలీసులు చాకచక్యంగా వారిని వెంబడించి పట్టుకున్నారు. ఈ క్రమంలో దుండగులు పోలీసులపై కాల్పులకు పాల్పడినట్లు సమాచారం. అయినా పోలీసులు ధైర్యంగా వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవీ చదవండి: