ETV Bharat / crime

ARREST: ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముఠా అరెస్ట్ - బైక్ దోంగలను అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు

ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి 19 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జనగామ, మట్వాడా, ఘనపూర్ స్టేషన్ల పరిధిలో పలు వాహనాలను చోరీ చేసినట్లు సీపీ తరుణ్​ జోషి పేర్కొన్నారు.

Warangal police arrested the bike thieves
బైక్ దోంగలను అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు
author img

By

Published : Jun 19, 2021, 7:02 PM IST

వరంగల్‌ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల వద్ద నుంచి 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటుగా చోరి చేసిన బైక్​లను, కొనుగోలు చేసిన పది మందిని అదుపులోకి తీసుకున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌ జోషి తెలిపారు.

నిందితులు మహేశ్​, శివాజీలు మరో ఇద్దరు స్నేహితులైన రవి, రాజేశ్​లతో కలిసి ద్విచక్రవాహనాలను దొంగిలించేవారిని సీపీ తరుణ్ జోషి తెలిపారు. వీరు జనగామ పోలీస్ స్టేషన్ పరిధిలో 9, రఘునాథపల్లిలో 5, మట్వాడాలో 3, ఘనపూర్, గుండాలలో ఒక్కోటి చొప్పున మొత్తం 19 బైకులను దొంగిలించారని పేర్కొన్నారు. బైకుల చోరిపై దృష్టి సారించిన పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారని అన్నారు. జనగామలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా వారిని గుర్తించామని చెప్పారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసిన 10 మందిని అరెస్ట్ చేసి.. వారి నుంచి ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ఇదీ చదవండి: BABY MURDER: పిల్లలు పుట్టలేదని పసివాడిని చంపేసింది..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.