ETV Bharat / crime

friend attack on young man at birthday : పుట్టినరోజు వేడుకలో ఘర్షణ.. యువకుడిని బీరు సీసాతో కొట్టిన స్నేహితుడు - తెలంగాణ వార్తలు

friend attack on young man at birthday : పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది. సాయిరెడ్డి అనే యువకుడిని బీరు సీసాతో కొట్టగా... అతడికి తీవ్ర గాయాలయ్యాయి. జగద్గిరిగుట్ట పరిధి ఎల్లమ్మబండలో అర్ధరాత్రి ఘటన జరిగింది.

friend attack on young man at birthday, birthday party attack
పుట్టినరోజు వేడుకలో ఘర్షణ
author img

By

Published : Dec 24, 2021, 11:26 AM IST

Updated : Dec 24, 2021, 3:17 PM IST

friend attack on young man at birthday : పుట్టిన రోజు వేడుకల్లో స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం... ఓ యువకుడిపై దాడికి దారి తీసింది. స్నేహితుల మధ్య ఘర్షణ జరిగి... సాయిరెడ్డి అనే యువకుడిని స్నేహితుడు బీరు సీసాతో కొట్టగా... తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

ఏం జరిగింది?

ఎలమ్మబండలో నివసించే శివ తన జన్మదిన వేడుకలను అంబీర్ చెరువు కట్ట కింద గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి నిర్వహించాడు. ఈ వేడుకల్లో మద్యం సేవించారు. స్నేహితుల మధ్య మాటామాటా పెరిగింది. సాయి రెడ్డి అనే యువకుడిపై హర్ష అనే వ్యక్తి దాడి చేశారని పోలీసులు తెలిపారు. బీరు బాటిళ్లతో సాయి రెడ్డి తలపై బలంగా కొట్టడం వల్ల అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు.

తల్లిదండ్రులు.. జాగ్రత్త

గాయాలపాలైన సాయిరెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని సీఐ సైదులు తెలిపారు. జన్మదిన వేడుకలే కాకుండా... రానున్న నూతన సంవత్సరం వేడుకల్లోనూ మద్యం మత్తులో దాడులకు పాల్పడుకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పుట్టినరోజు వేడుకలో ఘర్షణ

ఇదీ చదవండి: Sexual Harassment: వివాహితపై కామాంధుడి దాష్టికం.. కోరిక తీర్చాలంటూ నెలరోజులుగా..

Last Updated : Dec 24, 2021, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.