OMC MD: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డికి.. అనంతపురం జిల్లా రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జైలుశిక్ష విధించింది. 2008లో ఓబుళాపురం పరిధిలో ఓఎంసీ నిర్వాహకులు అనుమతికి మించి ఇనుప ఖనిజం తరలిస్తున్నారన్న సమాచారం పేరుతో.. జిల్లా అటవీశాఖ అధికారి కల్లోల్ బిశ్వాస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు.
అయితే.. విచారణకు వెళ్లిన తమను ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డి అడ్డుకుని, విధులకు ఆటంకం కలిగించారంటూ కల్లోల్ బిశ్వాస్ కేసు వేశారు. ఈ అంశంపై.. ఏళ్లుగా విచారణ సాగింది. సాక్షులను విచారించిన అనంతరం.. శ్రీనివాసరెడ్డిని కోర్టు దోషిగా నిర్ధరించింది. ఈ కేసులో నాలుగేళ్ల ఒక నెల జైలు శిక్ష, మూడు సెక్షన్ల కింద 8,500 రూపాయల జరిమానా విధించింది. దీనిపై....శ్రీనివాసరెడ్డి పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.