ETV Bharat / crime

ఓ ఇంట్లో పేలిన సిలిండర్.. పక్కింట్లో నలుగురు మృతి - gas Cylinder Blast in mulakaledu

Cylinder Blast in anantapur district
Cylinder Blast in anantapur district
author img

By

Published : May 28, 2022, 6:44 AM IST

Updated : May 28, 2022, 10:02 AM IST

06:41 May 28

ఏపీలో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి పక్కింట్లో నలుగురు మృతి

Cylinder Blast in anantapur district : అనంతపురం జిల్లా సెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి పక్కింటి పైకప్పు కూలి ముస్లిం కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

సిలిండర్​ పేలిన ఇంట్లో ఇద్దరికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కుటుంబసభ్యులను ఆసుపత్రి తరలించగా... మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకువెళ్లారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు దాదు(35), షర్ఫున(30), ఫిర్దోజ్(6), జైనుబి(60)గా పోలీసులు గుర్తించారు.

Last Updated : May 28, 2022, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.