ఏపీలోని నెల్లూరు జిల్లా ఓజిలి మండలం రాజుపాలెంలో తీవ్ర విషాదం నెలకొంది. చెరువు వద్ద ఆడుకునేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు.. ప్రమాదవశాత్తు నీటమునిగి మరణించారు. వారిని కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తి ఖలీల్ (45) కూడా మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.
చిన్నారులు.. మాచవరం హేమంత్(6), మాచవరం చరణ్ తేజ(8), జాహ్నవి(12) చెరువు వద్దకు ఆడుకునేందుకు వెళ్లి నీటమునిగారు. వీరి తల్లిదండ్రులు రాజుపాలెం హైవేపై దుకాణాలు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. నలుగురి మృతితో రాజుపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: ఇరువర్గాల మధ్య ఘర్షణ... కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు