Four people committed suicide in Tarnaka: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూపాలి అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. చెన్నైలోని కార్ల షోరూంలో డిజైనర్ మేనేజర్‌గా పనిచేసే ప్రతాప్.. హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేసే సింధూర దంపతులకు ఆద్య అనే కుమార్తె ఉంది. ప్రతాప్ తన తల్లి రాజతి, భార్య, కుమార్తెతో కలిసి తార్నాకలోని రూపాలి అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఈ ఉదయం బ్యాంకుకు రావాల్సిన సింధూర విధులకు హాజరుకాకపోవడం సహా ఫోన్ చేస్తే ఎత్తనందున బ్యాంకులో పనిచేసే ఆమె సహాద్యోగి ఒకరు ఇంటికి వెళ్లారు.
అక్కడ ఎంత పిలిచినప్పటికీ తలుపు తీయకపోవటంతో సమీపంలోనే ఉండే బంధువుల ఇంటికి వెళ్లి సమాచారం ఇచ్చారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపు తీసి చూడగా ప్రతాప్, ఆయన భార్య సింధూర, కుమార్తె ఆద్య, ప్రతాప్ తల్లి రాజతి చనిపోయి ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెన్నై వెళ్లే విషయంలో వాగ్వాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురిని చంపి ఆ తర్వాత ప్రతాప్ ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు అని మాకు డయల్ 100 ద్వారా ఫిర్యాదు వచ్చింది. ప్రతాప్‌తో పాటు తన భార్య సింధూర, కూతురు ఆద్య, ప్రతాప్ తల్లి రాజతి చనిపోయారు. సింధూర హిమాయత్‌నగర్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. ఈరోజు విధులకు హజరుకాకపోవడంతో వారి సహోద్యోగులు తార్నాకలోని రూపాలీ అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. సింధూర ఇళ్లు తాళం వేసినట్లు గుర్తించారు. అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూసే సరికి ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నారని మాకు సమాచారం ఇచ్చారు. ఇంటి తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లేసరికి నలుగురు చనిపోయారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. నాలుగు మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించాం. కుటుంబ కలహాలతోనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.-ఓయూ ఇన్స్పెక్టర్ రమేశ్
ఇవీ చూడండి..