Four arrested for harassing female students of engineering college: హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థినులను వేధిస్తున్న నలుగురు నిందుతుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఒక అమ్మాయితో పరిచయం ఏర్పరుచుని ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి... ఆమె ద్వారా ఇతర అమ్మాయిలు నంబర్లు తీసుకుంటున్నారని రాచకొండ సీపీ చౌహన్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో గ్రూప్స్ ఏర్పాటు చేసి వారిని వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటన ఇటీవల వచ్చిన ఓ చిత్రంలోని సన్నివేశాలను తలపిస్తున్నాయి.
సైబర్ నేరాలపై ఆ కళాశాలలో అవగాహన కల్పించామని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. అమ్మాయిలను సామాజిక మాధ్యమాల్లో వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతి కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.
అమ్మాయిలను వేధిస్తున్నారని తెలుసుకొని మేము లోతుగా పరిశీలించాం. మొబైల్ డాటా ద్వారా కనిపెట్టాం. ముందు ఒక అమ్మాయితో పరిచయం ఏర్పరచుకొని తరువాత తన స్నేహితులను వేధిస్తున్నారు. ఈ కారణంగా వారిని అరెస్టు చేశాము. ప్రతి కళాశాల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపడతాము. -చౌహన్, రాచకొండ సీపీ
ఇవీ చదవండి: