జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచారం పరిసారాల్లో అక్రమంగా దాచిన టేకు దుంగలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఎఫ్ఓ ఆదేశాలతో అధికారులు సంతోష్, వేణు.. గ్రామంలోని మల్లన్న చెరువు వద్ద ఉంచిన ఆరు దుంగలను భూపాలపల్లి రేంజ్‌కు తరలించినట్లు తెలిపారు.
అక్కడి నుంచి..
పట్టుకున్న దుంగల విలువ రూ.40వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా కలప అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిసిందని అధికారులు తెలిపారు. మహరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి దిగుమతి చేసుకుని.. గొర్లవేడు బీట్ పరిధిలోని నాచారంలో నిల్వ చేసుకుంటున్నారని వెల్లడించారు.
అటవీ శాఖ కనుసన్నుల్లో..
శాత్రజ్‌పల్లి అటవీ మార్గం ద్వారా పట్టణాలకు తరలిస్తున్నట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కలప అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నాచారం నుంచి కొన్ని సంవత్సరాలుగా గొర్లవేడు సెక్షన్ అటవీ శాఖ కనుసన్నుల్లోనే ఈ వ్యవహారం కొనసాగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
ఇదీ చూడండి: సైదాపురంలో కేంద్ర వైద్యవిజ్ఞాన పరిశోధకుల బృందం పర్యటన