ETV Bharat / crime

foreign currency seized in Shamshabad : శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ, బంగారం పట్టివేత - gold seized at shamshabad air port

foreign currency seized in Shamshabad : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో నిత్యం అధికారులు తనిఖీలు చేపడుతున్నా బంగారం, విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి రూ.29.44లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. అలాగే దుబాయి నుంచి వచ్చిన మరో వ్యక్తి నుంచి రూ. 18.18లక్షల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు.

foreign currency
విదేశీ కరెన్సీ
author img

By

Published : Feb 16, 2022, 1:30 PM IST

foreign currency seized in shamshabad: రంగారెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు కట్టుదిట్టంగా తనిఖీలు చేపడుతున్నా స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది. ఏదో రకంగా కేటుగాళ్లు స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా సోమాలియా దేశానికి చెందిన ఓ ప్రయాణికుడి నుంచి విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. షార్జా వెళ్లేందుకు వచ్చిన అతని నుంచి రూ.29.44లక్షల విలువ చేసే 40వేల అమెరికన్ డాలర్లు పట్టుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని నగదు సీజ్ చేశారు.

బెల్ట్ బకిల్​ల రూపంలో..

belt buckles
బెల్ట్ బకిల్స్

అదేవిధంగా దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద రూ.18.18లక్షల విలువైన 350గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. లగేజి బ్యాగులో, బెల్ట్ బకిల్​ల రూపంలో బంగారాన్ని తీసుకువచ్చినట్లు గుర్తించారు. ప్రయాణికుడిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:Employee Steals Gold From Bank : తాకట్టు పెట్టిన బంగారం మరొకరికి తనఖా.. పందేలు కాసి చివరకు..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.