ETV Bharat / crime

చార్మినార్​ వద్ద ఫుట్​పాత్​ దుకాణాదారుల కొట్లాట - charminar latest news

చార్మినార్​ వద్ద ఫుట్​పాత్​ దుకాణాదారులు దాడులు చేసుకున్నారు. స్థలం విషయంలో తలెత్తిన గొడవ కారణంగా రెండు వర్గాలు పరస్పరం కొట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Footpath shoppers attacking each other
ఫుట్​పాత్​ దుకాణదారుల గొడవ
author img

By

Published : Apr 8, 2021, 12:38 PM IST

పాతబస్తీ చార్మినార్ వద్ద బుధవారం ఫుట్​పాత్​ దుకాణాదారుల మధ్య స్థలం విషయంలో వివాదం తలెత్తింది. మహ్మద్​ యాసిన్ అనే చిరు వ్యాపారిపై జమీర్ అనే వ్యక్తి దాడి చేశాడు. అతని అనుచరులతో కలిసి యాసిన్​ను విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో యాసిన్​, జమీర్​ వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన యాసిన్​ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఏం జరిగిందంటే..

యాసిన్​ గత కొన్నేళ్లుగా చార్మినార్​ వద్ద ఫుట్​పాత్​పై వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం జమీర్​ అనే వ్యక్తి యాసిన్​ వద్దకు వచ్చి ఫుట్​పాత్​పై వ్యాపారం చేసుకోవాలంటే రూ.10 వేల అడ్వాన్స్​, రోజూ రూ.300 ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తన అనుచరులు మరో ఆరుగురితో కలిసి అతనిపై దాడి చేశారు.

బాధితుడు చార్మినార్​ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారం రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన.

ఇదీ చూడండి: సైదాబాద్​లో యువకుడి అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.