ETV Bharat / crime

బార్​ ఎదుట యువకుల వీరంగం.. యజమానిపై దాడి - five young men attacked on bar manager

ఆదివారం సెలవు రోజు కావడంతో అలా సరదాగా ఐదుగురు యువకులు బయటకు వచ్చారు. దగ్గర్లోని బార్​కు వెళ్లి పూటుగా మద్యం సేవించారు. ఇంకేముంది అప్పటిదాకా వారి మధ్య వెల్లువెత్తిన స్నేహబంధాన్ని మద్యం డామినేట్​ చేసింది. కారణం లేకుండా వారిలో వారే ఘర్షణ పడ్డారు. వీరి ఆగ్రహానికి ఆ బార్​ యజమాని బలయ్యాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

young men attacked on bar manager
బార్​ ఎదుట యువకుల వీరంగం
author img

By

Published : Aug 9, 2021, 6:21 PM IST

మద్యం మత్తులో ఐదుగురు యువకులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ బార్​లో వీరంగం సృష్టించారు. మద్యం డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు బార్ మేనేజర్​పై దాడి చేశారు. అడ్డుకోబోయిన సిబ్బందినీ కొట్టారు.

బార్​ ఎదుట యువకుల వీరంగం

కామారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ బార్​కు రాత్రి ఐదుగురు యువకులు వెళ్లారు. పూటుగా మద్యం సేవించిన అనంతరం వారిలో వారు గొడవ పెట్టుకొని ఘర్షణకు దిగారు. గొడవ ఆపేందుకు బార్ సిబ్బంది వెళ్లగా వారిపై కూడా దాడి చేశారు. మద్యం బిల్లు కట్టమని అడగడంతో మరోసారి దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో బార్ మేనేజర్ రాజేశ్వర్రావు తలకు తీవ్ర గాయమైంది. ఈ మేరకు పట్టణ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Kishor: ఆర్​ఎస్ ప్రవీణ్‌కుమార్‌ భయంతోనే వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.