ETV Bharat / crime

vishaka aob: విశాఖ ఏవోబీలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు - vishaka aob news latest

ఏపీలోని విశాఖ ఏవోబీలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి (firing between Maoists and police). మావోయిస్టుల ఆవిర్భావ వారోత్సవాల దృష్ట్యా మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో తులసిపాడు అటవీప్రాంతానికి డీవీఎఫ్, ఎస్‌వోజీ బలగాలు చేరుకున్నారు. పరారైన మావోయిస్టుల కోసం కూంబింగ్ (Police cumbing)కొనసాగుతోంది.

visakha aob
visakha aob
author img

By

Published : Sep 22, 2021, 9:38 AM IST

ఏవోబీలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి (visakha aob police cumbing). ఏపీ విశాఖలోని ఏవోబీలో పోలీసు బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. కాల్పులు జరుపుతూ మావోయిస్టులు తప్పించుకున్నారు. మల్కన్‌గిరి జిల్లా తులసిపాడు అటవీప్రాంతంలో కాల్పులు జరిగాయి (firing between Maoists and police). మావోయిస్టుల ఆవిర్భావ వారోత్సవాల దృష్ట్యా మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో తులసిపాడు అటవీప్రాంతానికి డీవీఎఫ్, ఎస్‌వోజీ బలగాలు చేరుకున్నారు. పరారైన మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది.

వారోత్సవాల క్రమంలో పోలీసులు కూంబింగ్...

మావోయిస్టుల ఆవిర్భావ వారోత్సవాలు ఈ నెల 21 నుంచి వారం పాటు జరుపుతున్నట్లు పిలుపినిచ్చారు. మావోయిస్టుల చట్ట వ్యతిరేక చర్యలు తిప్పికొట్టేందుకు పోలీసులు.. ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు విస్తృతం చేశారు. ఎస్పీ ఆదేశాలతో విశాఖ జిల్లా స్థాయి డివిజన్ స్థాయి పోలీసులు ఓఎస్​డి, ఏఎస్​పి పాడేరు, జి.మాడుగుల సర్కిల్ ఏజెన్సీ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు.

విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం నుర్మతి పోలీసు అవుట్ పోస్టుల సమీపంలో గాలింపు ముమ్మరం చేశారు. డ్రోన్ కెమెరా పెట్టి ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో రాకపోకలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వాహనాల తనిఖీలు చేపట్టి అనుమానితుల గుర్తింపు కార్డులు పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తున్నారు. ఒడిశా సరిహద్దు గ్రామాల్లో కొత్త వారు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రకటించారు.

డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్, భారీ సాయుధ బందోబస్తును ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా తనిఖీలు చేస్తున్నారు. ఏజెన్సీ కేంద్రం పాడేరులో ఎస్సై ఆధ్వర్యంలో సరిహద్దు గస్తీ చేశారు. పాడేరులో సీఆర్పీఎఫ్ B/198 బెటాలియన్, పోలీస్ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు.

ఇదీ చూడండి: Maoist: మావోయిస్టు వారోత్సవాలు షురూ.. తెలంగాణకు కొత్త సారథి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.