వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేట్, జానకిపురం గ్రామాల పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. అమరేందర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన జామాయిల్ తోటలో మంటలు చెలరేగి తోట మొత్తం విస్తరించాయి. దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న హన్మకొండ అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోవడం వలన మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ఆర్పివేశామని అగ్నిమాపక శాఖ అధికారి నాగరాజు తెలిపారు. మంటలు సుమారు 20 ఎకరాల వరకూ వ్యాపించాయని.. రూ.1 లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: విద్యుదాఘాతంతో బాలుడు మృతి