మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యాక్సిక్‌బ్యాంక్ ఏటీఎంలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన ఇంటి యజమాని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. బొంబాయిలోని యాక్సిస్ బ్యాంకు కంట్రోల్ రూమ్ నుంచి మహబూబాబాద్ పట్టణ పోలీసులకు ఆగంతుకులు ఏటీఎంను దగ్గం చేశారని సమాచారం అందించారు.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఘటనా స్థలం సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఆగంతకులు ఏటీఎంలో చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలం కావడంతో దగ్ధం చేశారా? మరేదైనా కారణమా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
ఇదీ చదవండి: Cyber crime: సైబర్ మోసాలకూ స్పెషల్ కోచింగ్ సెంటర్లు.. పట్టణాల్లో బహిరంగంగానే...