Madhapur Fire Accident: మాదాపూర్‌లోని టైర్ల దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కావూరి హిల్స్ బ్రాంచ్ సమీపంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో చుట్టుపక్కల వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పారు. ఆదివారం కావడంతో టైర్ల దుకాణం మూసి ఉంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఇదీ చదవండి : కరీంనగర్ కారు ప్రమాదం ఘటనలో నిందితులు అరెస్టు