ETV Bharat / crime

అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన అపార్ట్​మెంట్​ వాసులు

Fire Accident at nanakramguda: హైదరాబాద్​లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నానక్‌రామ్‌గూడలోని ఓ ఆపార్ట్​మెంట్​లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అపార్ట్​మెంట్ వాసులు బయటకు పరుగులు తీశారు.

Fire Accident at nanakramguda
అపార్ట్​మెంట్​లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
author img

By

Published : Jun 2, 2022, 8:28 AM IST

అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన అపార్ట్​మెంట్​ వాసులు

Fire Accident at nanakramguda: నగరంలోని నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్‌మెంట్‌లో విద్యుదాఘాతం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెలిస్టియా అపార్ట్‌మెంట్‌లోని సెల్లార్​లో విద్యుత్‌ ప్యానల్‌ బోర్టులో షార్ట్ సర్క్యూట్​కు కావడంతో దట్టమైన పొగలు కమ్మేశాయి. ప్రమాదం కారణంగా విద్యుత్‌ ప్యానల్‌ బోర్డు పూర్తిగా దగ్దమైంది.

అపార్ట్​మెంట్​లో దట్టమైన పొగలు అలుముకోవడంతో ఏం జరుగుతుందో తెలియక అర్థం కాక ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 24వ అంతస్తులో చిక్కుకుపోయిన నలుగురిని కిందకు తీసుకువచ్చారు. రెండు అగ్నిమాపక శకటాలతో నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగపోవడంతో అపార్ట్​మెంట్​ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవీ చదవండి: జీడిమెట్లలో ఒకేరోజు రెండు పేలుళ్లు.. ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు

వీధి కుక్కకు ఇన్​స్టా అకౌంట్​.. యూనివర్సిటీలో ధూమ్​ధామ్​గా బర్త్​డే వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.