నిజామాబాద్ నగర శివారు కాలూరులో రైసుమిల్లు వద్ద ధాన్యం లోడుతో ఆగి ఉన్న లారీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా లారీ ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. నిజామాబాద్ గ్రామీణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి: నిషేధిత గుట్కా సరఫరా చేస్తోన్న ముఠా అరెస్ట్