ETV Bharat / crime

జిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన అగ్నికీలలు

author img

By

Published : Feb 6, 2022, 5:10 PM IST

Updated : Feb 6, 2022, 6:57 PM IST

17:06 February 06

జిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన అగ్నికీలలు

జిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన అగ్నికీలలు

పెద్దపల్లి మండల పరిధి రాఘవాపూర్‌ గ్రామ శివారులోని శ్రీరామ జిన్నింగ్‌మిల్లులో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మిల్లులో నిల్వ చేసిన పత్తి బేళ్లు భారీగా దగ్ధమయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు పెద్దపల్లి, గోదావరిఖని, మంథనికి చెందిన అగ్నిమాపక సిబ్బంది 5 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించారు.

మిల్లులోకి పత్తి దిగుమతి చేసేందుకు వచ్చిన ఓ డీసీఎం వ్యాన్‌ నుంచి మంటలు రావడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 4 వేల నుంచి 5 వేల క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతి అయింది. రెండు కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు మిల్లు యాజమాన్యం అంచనా వేసింది.

ఇదీ చదవండి:

Last Updated : Feb 6, 2022, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.