Bus Fire Accident in AP : ఏపీలో పశ్చిమగోదావరి జిల్లాలో జలవిషాదం మరవకముందే.. గురువారం వేకువజామున మరో బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా చీరాల వస్తున్న ప్రైవేటు బస్సులో ప్రయాణికులు నిద్రిస్తుండగానే మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఆ సయమంలో మెలకువలో ఉన్నవారి అరుపులతో బస్సు నుంచి బయటకు దూకి అందరూ ప్రాణాలు కాపాడుకున్నారు.
Bus Fire Accident Today : ఏపీలోని ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రయాణికుల సామగ్రి మంటల్లో దగ్ధమైంది. బస్సు హైదరాబాద్ నుంచి చీరాల వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Bus Burnt in Prakasham District : ఇంజిన్లో లోపమా లేక ఏసీలో విద్యుదాఘాతం వల్ల మంటలు చెలరేగాయా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సులో కనీసం ఫైర్ ఎవాక్యువేషన్ లేదని.. ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామగ్రి మొత్తం బుగ్గిపాలు అయిందని వాపోయారు.