ETV Bharat / crime

ఫర్నీచర్‌ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం.. కోట్ల ఆస్తి నష్టం

Fire Accident: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓంకార్ నగర్‌లోని ఓ ఫర్నీచర్ షాప్‌, థర్మాకోల్​ గోదాముల్లో మంటలు పెద్దఎత్తున చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. సుమారు రూ.5కోట్ల నుంచి రూ.6కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బాధితులు తెలిపారు.

అగ్నిప్రమాదం
అగ్నిప్రమాదం
author img

By

Published : Jul 30, 2022, 5:16 PM IST

Updated : Jul 30, 2022, 8:15 PM IST

Fire Accident: రంగారెడ్డి జిల్లా ​ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓంకార్ నగర్‌లోని ఎన్ ఇంటిరీయల్ గ్యాలరీ ఫర్నీచర్ షాప్‌, శివ మెటల్ ఎంటర్ ప్రైజెస్ గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది ఐదు అగ్నిమాపక వాహనాలతో ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అగ్ని కీలలకు దుకాణంలోని ఫర్నిచర్, సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ప్రమాదంలో సుమారు రూ.5కోట్ల నుంచి రూ.6కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. అయితే అగ్నిమాపక శాఖ అధికారులు సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి రాలేదని ఆరోపించారు. గంటన్నర ఆలస్యంగా రావడంతో భారీగా నష్టం వాటిల్లినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఫర్నీచర్‌ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.కోట్ల ఆస్తి నష్టం

ఇవీ చదవండి: మినీ జూపార్క్‌ను తలపిస్తున్న క్యాసినో ఏజెంట్‌ చీకోటి ప్రవీణ్​ ఫాంహౌస్‌..

కుమార్తెపై తల్లి కర్కశం.. చెప్పుతో చితకబాది.. నేలకేసి కొట్టి..

Last Updated : Jul 30, 2022, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.