ETV Bharat / crime

ప్రేమ, పెళ్లి పేరుతో జూనియర్‌ ఆర్టిస్టుపై లైంగిక వేధింపులు.. ఆ సినిమా హీరో అరెస్ట్ - జూనియర్ ఆర్టిస్టును వేధించిన వ్యక్తి అరెస్టు

Film Actor Arrest Harassing Junior Artist: జూబ్లీహిల్స్‌లో జూనియర్‌ ఆర్టిస్టును లైంగికంగా వేధించిన సినీనటుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఫిర్యాదులో కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Film Actor
Film Actor
author img

By

Published : Oct 12, 2022, 4:41 PM IST

Film Actor Arrest Harassing Junior Artist: జూనియర్ ఆర్టిస్టును ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన సినీ నటుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. తనను లైంగికంగా వేధింపులు గురిచేయడంతో పాటు కులం పేరుతో దూషిస్తుండడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన మోసాన్ని ఫిర్యాదులో తెలిపింది. జులై 9న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటినుంచి నిందితుడు తప్పించుకుని తిరిగాడు. ఆ రోజు నుంచి కనిపించకుండా తిరిగిన సినీ నటుడు ప్రియాంత్‌ను ఇవాళ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 'కొత్తగా మా ప్రయాణం' సినిమా హీరో ప్రియాంత్‌కు ఓ జూనియర్ ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కొన్ని రోజులకు మరింత దగ్గరైంది. ఇదే చనువుగా తీసుకున్న ప్రియాంత్ రెండు నెలల తర్వాత ఆమెకు లవ్‌ ప్రపోజ్ చేశాడు. దాంతో అప్పటినుంచి వారిద్దరి మధ్య ప్రేమాయాణం కొనసాగింది. ఈ క్రమంలో ఒక రోజు ప్రియాంత్ ఆమెకు ఫోన్‌ చేసి మనం పెళ్లి చేసుకుందాం బయటకిరా అని మాయ మాటలు చెప్పాడు. అది నమ్మిన బాధితురాలు అతని బైక్ ఎక్కింది.

అప్పుడు ప్రియాంత్ ఆమెను తీసుకుని పెళ్లి చేసుకుందామని.. హైదరాబాద్‌ శివార్‌లోని ప్రగతి రిసార్ట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీరా పెళ్లి అంటే ఎదో ఒక సాకు చెప్పి తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు. దీంతో ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా శ్రీనగర్ కాలనీలో ఉన్న కార్యాలయానికి తీసుకెళ్లి పలుమార్లు లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు వెల్లడించింది. చివరకు బాధితురాలు గర్భం దాల్చడంతో నిందితుడు మోహం చాటేసినట్లు పోలీసులకు తెలిపింది. అబార్షన్ కోసం మందులు ఇవ్వడంతో అనారోగ్యం పాలయ్యానని... అంతేకాకుండా విషయం బయటకు చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన గోడును వెళ్లబోసుకుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.