కరోనా లాక్డౌన్ కారణంగా ఏ పని దొరక్క కుటుంబపోషణ భారంగా మారిన ఓ తండ్రి.. తన కొడుకుపై కిరోసిన్ పోసి తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్టేషన్ పరిధిలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ ఘటన జరిగింది. ఏపీలోని కర్నూలుకు చెందిన గోకరి ప్రవీణ్ కుమార్(39).. ఇరవై ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి కూలీ పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు.
ఐదేళ్ల క్రితం కొడుకు పుట్టగానే అతని భార్య వారిని వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కూలీ పనులు చేసుకుంటూ మాటలు సరిగా రాని కొడుకుతో కలిసి అహ్మదుగుడా సమీపంలో గదిని అద్దెకు తీసుకొని నివసిస్తున్నాడు. లాక్‌డౌన్‌తో ఉపాధి కరవై ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది.. తన కొడుకుతో కలిసి చనిపోవాలని నిశ్చయించుకున్నాడు. మొదట కుమారునిపై కిరోసిన్ పోసి తరువాత తనపై పోసుకొని నిప్పటించుకున్నాడు. వారిద్దరూ మంటల్లో కాలుతుండగా గమనించిన స్థానికులు మంటలు చల్లార్చి అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితీ విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: Sister and Brother missing: ఆడుకోడానికి వెళ్లిన అక్కాతమ్ముడు అదృశ్యం