Cheating in hyderabad: రాజధాని నగరంలో తండ్రి, కుమారులిద్దరిని మోసగించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఏకంగా వారి వద్ద నుంచి రూ.16.10 కోట్లు కాజేశారు. దీంతో తండ్రి, కొడుకులిద్దరు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించడంతో ఘరానా మోసం బయటపడింది. ఈ మోసానికి పాల్పడిన నిందితులు కూడా తండ్రి, కుమారుడే కావడం కొసమెరుపు. శివశంకర్ తనకు షేక్‌పేటలో స్థలం ఉందని.. సునీల్ వద్ద నుంచి రూ.6.5 కోట్లు కొట్టేశాడు. అదేవిధంగా శివశంకర్ కుమారుడు కోమల్ ప్రసాద్.. సునీల్ కుమారుడు అశిష్‌ను కలిసి కొండాపూర్‌లోని ఓ వాణిజ్య సముదాయంలో మూడో అంతస్తు మొత్తం నీకే ఇస్తానంటూ రూ.9.6 కోట్లు కాజేశాడు.
అసలేం జరిగిందంటే: బంజారాహిల్స్‌లో ఉంటున్న తండ్రీ కుమారులు సునీల్ అహుజా, ఆశిష్ అహుజాల నుంచి ఇద్దరు నిందితులు శివశంకర్, కోమల్ ప్రసాద్‌లు రూ.16.10 కోట్లు కాజేశారు. సునీల్, ఆశిష్ వేర్వేరుగా ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు.. నిందితుల పేర్లు చూసి అవాక్కయ్యారు. శివశంకర్, కోమల్‌ప్రసాద్ కూడా తండ్రీకొడుకులేనని తెలుసుకున్నారు. షేక్‌పేటలో తనకు స్థలం ఉందని శివశంకర్ రెండేళ్ల క్రితం సునీల్‌కు చెప్పాడు. వాణిజ్య భవనం నిర్మించి 8వేల చదరపు అడుగుల ఏరియా ఇస్తానని నమ్మించి 2020లో రూ.6.5 కోట్లు తీసుకున్నాడు. శివశంకర్ కుమారుడు కోమల్ ప్రసాద్.. సునీల్ కుమారుడు అశిష్‌ను కలిసి కొండాపూర్‌లోని ఓ వాణిజ్య సముదాయంలో మూడో అంతస్తు మొత్తం నీకే ఇస్తానంటూ రూ.9.6 కోట్లు తీసుకున్నాడు. డబ్బు కోసం నిలదీయగా ఇద్దరూ చేతులెత్తేశారు.
ఇవీ చదవండి:ఆ యువకుడిది హత్యేనా..! తేల్చనున్న జాతీయ ఎస్సీ కమిషన్
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి చేనేత ప్రదర్శన.. ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్