ETV Bharat / crime

ఉద్యోగాల పేరుతో తండ్రీకుమార్తె ఎర.. రూ. 50 లక్షలు మోసం - father and daughter cheating by railway jobs

Father and Daughter Cheating by Railway jobs: నిరుద్యోగుల ఆశలను పెట్టుబడిగా పెట్టి రూ. లక్షల్లో మోసాలకు పాల్పడుతున్నారు ఓ తండ్రీకూతురు. కుమార్తెకు విలువలకు నేర్పిస్తూ.. సన్మార్గంలో నడిచేచేలా చూడాల్సిన ఆ తండ్రే.. ఆమెను తప్పుడు మార్గంలో నెట్టేశాడు. ఉద్యోగాల ఎర వేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఎట్టకేలకు ఓ బాధితుడి ఫిర్యాదుతో వారి మోసం బట్టబయలైంది. చివరకు కటకటాలపాలయ్యారు.

cheating by railway jobs
రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తండ్రీకుమార్తె మోసం
author img

By

Published : Mar 18, 2022, 12:11 PM IST

Updated : Mar 18, 2022, 12:37 PM IST

Father and Daughter Cheating by Railway jobs: రైల్వే ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగించిన తండ్రీకుమారైను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి.. రైల్వేలో ఉద్యోగం చేస్తున్న దూరపు బంధువు గొల్లపల్లి నాగరాజు ఉద్యోగం పేరుతో ఆశజూపాడు. తన కుమార్తె రైల్వేలో జనరల్ మేనేజర్​గా పని చేస్తోందని, ఆమెకు ఉన్నతాధికారులతో పరిచయం ఉందని నమ్మించాడు. రూ. 5 లక్షలు కడితే ఉద్యోగం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చాడు. వారు చెప్పేది నిజమని నమ్మిన బాధితుడు.. రూ. 5 లక్షలు కట్టారు.

నిందితుడు నాగరాజు

కొన్ని రోజుల తర్వాత ఉద్యోగం వచ్చిందని చెప్పి.. బాధితుడికి నాగరాజు, అతని కుమార్తె నకిలీ నియామకం పత్రం ఇచ్చారు. ఆ విషయం గమనించని బాధితుడు.. దానిని తీసుకుని సికింద్రాబాద్​లోని రైల్​ నిలయానికి వెళ్లారు. అక్కడి అధికారులు పత్రాన్ని పరిశీలించి నకిలీగా గుర్తించారు. వెంటనే మేడిపల్లి పోలీసు స్టేషన్​లో తండ్రి, కుమార్తెపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రీకుమార్తెను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 20 మంది నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వరకూ.. నిందితులు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో వారిద్దరినీ రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి: జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. పసికందు మృతి.. వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్​.!

Last Updated : Mar 18, 2022, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.