పంటకు నీరు పెటేందుకు వెళ్లిన కుర్వ గోపాల్ అనే రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించాడు. విషాదకరమైన ఈ ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ మండలం బొకూరు గ్రామంలో జరిగింది.
బొకూరు గ్రామానికి చెందిన కుర్వ గోపాల్ కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి మోటారుని ఆన్ చేయగా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు.
ఇదీ చదవండి: లైవ్ పుటేజి: ఒకేసారి మూడు వాహనాలు ఢీ